తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం సమావేశమై పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.