పార్టీ పటిష్టానికి కలిసికట్టుగా కృషి చేయాలి
కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపాడాలని కోరారు.
- స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై దృష్టిపెట్టాలి
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
- జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం
జగిత్యాల, డిసెంబర్ 13: కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు పాటుపాడాలని కోరారు. జిల్లా కేంద్రంలోని భాగ్యరాజ్ ఫంక్షన్హాల్లో జగిత్యాల అర్బన్, రూరల్ మండ ల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రా ష్ట్రంలో ప్రభుత్వం లేదని అధైర్య పడవద్దని, దేశం లో ఎకడాలేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరిగిందన్నారు. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. అయినా 39 మందితో రాష్ట్ర అసెంబ్లీలో గట్టి ప్రతిపక్షం ఉందని, ప్రజా సమస్యల పరిషారం కో సం, ప్రభుత్వ హామీలు ప్రజలకు అమలు చేసే దిశగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉంటామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీలు ములాసపు లక్ష్మి, రాజేంద్రప్రసాద్, జడ్పీటీసీ మహేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్‌రావు, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, మండలాధ్యక్షుడు బాల ముకుందం, పీఎసీఎస్ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సందీప్ రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్లు నకల రవీందర్ రెడ్డి, జుంబర్తి శంకర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చెరుకుజాన్, గంగాధర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహేశ్, ఆర్బీఎస్ సభ్యులు కట్ట రాజేందర్, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, ఏఎంసీ, పీఎసీఎస్ వైస్ చైర్మన్లు అసిఫ్, సురేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

