ఘనంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జన్మదిన వేడుకలు
సుల్తానాబాద్, ఫిబ్రవరి 25: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం సుల్తానాబాద్‌లో టీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ధవాఖానలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే దాసరి ప్రారంభించగా, అంతకు ముందు కేక్‌కట్ చేసిన ఎమ్మెల్యేకు పలువురు నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూజారులు ప్రత్యేక పూజలు చేయగా, ముస్లిం మతగురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతారమేశ్ ఆధ్వర్యంలో పూసాలలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఐతరాజ్పల్లి మాజీ ఎంపీటీసీ దీకొండ భూమేశ్ ఆధ్వర్యంలో స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, వ్యవసాయ మార్కెట్లో కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి, హమాలీలకు టీషర్టులు, గడియారాలు అందించారు. పట్టణంలో అన్ని వార్డుల్లో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మాజీ ఎంపీపీ ఐల రమేశ్, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డాక్టర్ శ్రీరాం, పురం ప్రేం చందర్రావు, జూపెల్లి సందీప్‌రావు, పారుపెల్లి గుణపతి, తాళ్లపల్లి మనోజ్‌గౌడ్, వీరగోని రమేశ్‌గౌడ్, కోట రాంరెడ్డి, మోలూగూరి అంజయ్య, దీకొండ భూమేశ్, వల్స నీలయ్య, గుర్రాల శ్రీనివాస్, అనుమాల బాపురావు, డాక్టర్ కలీం, సాజిద్, బండి సంపత్ తదితరులున్నారు.