పెద్దపల్లిని అద్దంలా తీర్చిదిద్దుతా
‘తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పెద్దపల్లికి విరివిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన..మళ్లీ గెలిపిస్తే అద్దంలా తీర్చిదిద్దుతా..’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య ర్థి దాసరి మనోహర్‌రెడ్డి హామీ ఇచ్చారు.
- కాంగ్రెస్ హయాంలో అస్తవ్యస్తం
- పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి, నవంబర్ 24: ‘తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పెద్దపల్లికి విరివిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన..మళ్లీ గెలిపిస్తే అద్దంలా తీర్చిదిద్దుతా..’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య ర్థి దాసరి మనోహర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్ద మసీద్ ఏరియా నుంచి అమర్ రోడ్డులో పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.
దుకాణాలు, ఇండ్లకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడు తూ కాంగ్రెస్ హయాంలో పెద్దపల్లి అభివృద్ధిని ప ట్టించుకోలేదని ఆరోపించారు. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి కండ్ల ముందరే కనిపిస్తున్నదని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు దాసరి ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో పలు వార్డు ల్లో ప్రచారం చేశారు. మన సారూ గెలిస్తేనే అభివృద్ధి అని, లేకుంటే అధోగతేనని హెచ్చరించారు. అలాగే 25, 26,30, 35 వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు.
కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు సీ సత్యనారాయణరెడ్డి, వే ము ల రామ్మూర్తి, మొబిన్, పెద్దపల్లి ఏఎంసీ చై ర్మ న్ జడల సురేందర్, ఖలీల్, మున్న, జానీ, రఫీ ఉ ల్లాఖాన్, సాబీర్, రఫ్, కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, దేవనంది రమాదేవి, పట్టణాధ్యాక్షుడు ఉ ప్పు రాజ్‌కుమార్ నేతలు చొప్పరి వంశీ, వా సు, వెన్నం రవి, కుక్క కనకరాజు, పురుషోత్తం, కుక్క సతీశ్, పేర్క బానేష్, కుక్క రాజమల్లు, కుక్క జ్యో తి, కుక్కు రాజేశ్వరి, ప్రశాంత్, కుక్క సునీత, మా నస, కొమురమ్మ, కుక విక్రమ్, శివ విజ్ఞాన్, కు క ప్రణయ్, కుక అభినవ్, సుమంత్, మహంకాలి సిద్ధూ, సయ్యద్ సోహెల్, దేవనంది సాగర్, సూరజ్, రాజేశం, రోషిణి, కల్యాణి, లలిత, రమే శ్, సాయిరాజ్, భాగ్య, రోమరిత్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బాబాయ్..నీ చాయ్ మస్తు ఫేమస్..
బాబాయ్ బాగున్నావా.. బాబాయ్ చాయ్ అంటే మస్తు ఫేమస్ అనే టాక్ ఉన్నది. కట్టలబొగ్గుల మీద చాయ్ చేస్తవని, రుచి బాగుంటుంది. రెండు సార్లు నాకు ఓటు వేస్తే అభివృద్ధి చేసి చూపిన.. అమర్‌నగర్ నుంచి మసీద్ దాక రెండు వరసల తారు రోడ్డు పనులు సాగుతున్నయ్. వ్యాపారాల కు ఇబ్బందులు లేకుండా రోడ్డు వేయిసున్న. ఈ సారి కూడా మీ ఓటు కారుకే వేయాలని చాయ్ చేసి, ఓటు అభ్యర్థించారు పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

