వేములవాడ, నవంబర్ 19: అంబేదర్ ఆశయ సాధనకు యువత ముందుకురావాలని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచించారు. ఆదివారం సంఘం భవనంలో సంఘం పెద్దమనిషి కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చల్మెడకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. అనంతరం సంఘం సభ్యులను ఉద్దేశించి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేదర్ కృషితోనే నేడు దేశంలోని అన్నివర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయని, నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
యువత అనుకుంటే సాధించలేనిది ఏమిలేదని సూ చించారు. అసంపూర్తిగా ఉన్న సంఘం భవనాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. గెలిచిన వెంటనే సంఘం భవనాల పూర్తి నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, నాయకులు గూడూరి మధు, నామాల లక్ష్మీరాజం, ముద్రకోల వెంకటేశం, నాయకులు పెంట రాములు, పెంట శంకర్, పెంట రాజయ్య, పెంట చంద్రయ్య, సావనపల్లి శ్రీధర్, పెంట నారాయణ, గాజుల పోశెట్టి, పెంట పోచయ్య, దుర్గయ్య, సంతోష్, సావనపల్లి శేఖర్, శ్రీను, కుమ్మరి లక్ష్మీరాజం, నర్సయ్య, దేవయ్య పాల్గొన్నారు.