జైబోలో శ్రీరామ్‌కీ..
జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, శివనగర్‌లోని శివాలయం, విశ్వనాథ ఆలయం, భక్తాంజనేయ, అంబభవాని, సీతారామాంజనేయ, రామాలయం, వాసవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠతో వెల్లివిరిసిన భక్తిభావం
- రామనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
- భజనలతో గ్రామాలు,పట్టణాల్లో ర్యాలీలు
- వేడుకలను భారీ స్క్రీన్లపై తిలకించిన భక్తులు
వేములవాడటౌన్/ వేములవాడ రూరల్/ కోనరావుపేట/ఎల్లారెడ్డిపేట/ గంభీరావుపేట/ ముస్తాబాద్/చందుర్తి/ఇల్లతకుంట, జనవరి 22: జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, శివనగర్‌లోని శివాలయం, విశ్వనాథ ఆలయం, భక్తాంజనేయ, అంబభవాని, సీతారామాంజనేయ, రామాలయం, వాసవీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ అనుబంధ దేవాలయమైన కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం, వట్టిమల్లలోని శ్రీ సీతారామస్వామి, నాగారంలోని కోదండరామ స్వామి ఆలయాలు రామనామస్మరణతో మార్మోగాయి.
ఎల్లారెడ్డిపేటలోని సత్సంగ సదనంలో వేదపండితులు రామనామం గొప్పదనాన్ని వివరించారు. వేములవాడ, వేములవాడ రూరల్ మం డలాల్లోని పలు గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో శ్రీరామనామ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే మండప హనుమాన్ ఆల య ఆవరణలో రాములోరి కల్యాణమహోత్సవం నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, నేతలు, కౌన్సిలర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రుద్రంగిలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, హాజరయ్యారు.
అనంతరం భక్తులు భజన కీర్తనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో భజనలతో ర్యాలీలు తీసి, ఇండ్లల్లో దీపాలు వెలిగించారు. భక్తులు టీవీల ముందు చేరి అయోధ్యలో బాలరాముడి విగ్ర హ ప్రతిష్ఠను వీక్షించారు. గంభీరావుపేట మం డల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో మూలవిరాట్ విగ్రహాలకు అభిషే కం చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసా దం అందించి, సాయంత్రం ఉత్సవవిగ్రహాల ను గరుడ సేవపై పురవీధుల గుండా ఊరేగించా రు. గోవిందనామస్మరణతో రామాలయం మార్మోగింది.
ఆలయ ఆవరణలో ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చందుర్తిలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్రీన్‌లో వేడుకలను వీక్షించారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పూజలు చేశారు. మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం లో వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేయగా, వైశ్య సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో లడ్డూలు పంపిణీ చేశారు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఊరూరా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. శోభాయాత్రలు, భజనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది. జై శ్రీరామ్ నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. ఉదయం ఐదు గంటల నుంచే ప్రత్యేక పూజలు, యజ్ఞయాగాదులు, భజనలు చేయగా, ఆలయాలన్నీ కిటకిటలాడాయి.
500ఏండ్ల కల నెరవేరడంతో రామభక్తులు సంబురపడ్డారు. వాడవాడలా అన్నప్రసాదాలు వితరణ చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ ఇండ్లల్లో దీపాలు వెలిగించి, అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను తలపై చల్లుకొని వేడుకలను సంబురంగా జరుపుకొన్నారు. పలు గ్రామాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రజలు తిలకించారు.
– రాజన్న సిరిసిల్ల, జనవరి 22 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

