చందుర్తి/రుద్రంగి,డిసెంబర్ 31: మోహిని కుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలం నర్సింగపూర్‌లోని మోహినికుంట మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇకడ జడ్పీటీసీ నాగం కుమార్, మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, సర్పంచ్ రాపల్లి గంగాధర్, ఆలయ కమిటీ చైర్మన్ నక గంగాధర్ ఉన్నారు. కాగా రుద్రంగి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి, అయప్పస్వామి, పెద్దమ్మతల్లి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని సర్పంచ్ తర్రె ప్రభలత, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
త్వరలోనే మండల కేంద్రంలోని ఆలయాలు, రోడ్లు, కార్యాలయాలు, కుల సంఘాల సమస్యలను ప్రజాప్రతినిధులు, నాయకులతో చర్చించి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం రుద్రంగి నూతన ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులను సత్కరించారు. కోనరావుపేట మండలం కొలనూర్ గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి ప్రారంభించారు. ఇక్కడ ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సర్పంచ్ బొజ్జ వసంత, ఎంపీటీసీ ప్రవీణ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, నాయకులు పాల్గొన్నారు.