కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో స్వల్పంగా భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 6:48 గంటలకు 3 సెకండ్ల పాటు కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్లు తెలుస్తున్నది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. గంగాధర, చొప్పదండిలోని వాస గృహాలు, దుకాణ సముదాయాలు, సూపర్మార్కెట్లలో సామానులు కిందపడిపోగా, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వీధుల్లోకి వచ్చి భూకం పం వచ్చిందంటూ చెప్పుకొన్నారు. కాసేపు కలవర పడ్డారు. పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన భూ కంప దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.