Minister Vivek | ధర్మారం, అక్టోబర్22: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోనగిరి పెద్దులు ను బుధవారం రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పెద్దులు భార్య లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించింది.
సమాచారం తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రామానికి వచ్చి మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పెద్దులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మీ మృతి పట్ల ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు . మంత్రి వివేక్ వెంట కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకుర్తి రాజేశం గౌడ్, పొన్నం కృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.