చిగురుమామిడి, జనవరి 28: సహకార సంఘాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతిరైతూ సొసైటీలో సభ్యుడిగా చేరి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఆదివారం మండలంలోని రేకొండలో ‘ది రేకొండ హాలిక్ అండ్ శ్రమజీవి’ సొసైటీ 51వ వార్షికోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చాడ వెంకట్‌రెడ్డితో కలిసి రూ. 4.60 లక్షలతో నిర్మించిన గోదాంను ప్రారంభించారు.
అనంతరం సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలోనే సహకార సంఘాలు బలోపేతమయ్యాయని చెప్పారు. డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్ తెచ్చిన హరితవిప్లవంతో దేశం ఆహారవృద్ధిలో పురోగతి సాధించిందన్నారు. తాను 2005లో కరీంనగర్ సొసైటీలో చేరి, డీసీఎంఎస్, ఎస్ఎంసీ, మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. నాడు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీకి చర్యలు చేపట్టానని చెప్పారు.
గ్రామీణులందరూ ఐక్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొద్దిమంది రైతులతో సహకార సంఘాన్ని స్థాపించి, అనతికాలంలోనే అభివృద్ధి చేశానని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పాలకవర్గానికి సూచించారు. అనంతరం ఆయన తాను రచించిన ‘రేకొండ సామాజిక చైతన్యం, గ్రామీణ స్థితిగతులు’ పుస్తకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ఆర్డీవో మహేశ్వర్‌కు అందజేశారు.
చిగురుమామిడి మండలం సీతారాంపూర్, గునుకుల పల్లె, గాగిరెడ్డి పల్లె గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అలాగే, మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి పవన్ కుమార్, ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, డీసీవో రామానుజం, పంచాయతీరాజ్ డీఈఈలు రవిప్రసాద్, వెంకటేశం, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో నర్సయ్య,
మండల వైద్యాధికారి విప్లవ శ్రీ, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ ఖాజామొహీనుద్దీన్, రేకొండ సొసైటీ చైర్మన్ మండల కొమురయ్య, సర్పంచులు పిట్టల రజిత, గోలి బాపు రెడ్డి, ముప్పిడి నర్సింహారెడ్డి, గుంటి మాధవి, గునుకుల అమూల్య, అందె స్వరూప, సన్నీల్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, ఎంపీటీసీలు కోమటిరెడ్డి చంద్రకళ, కొత్తూరు సంధ్య, అందె స్వప్న, ఆలేటి రవీందర్ రెడ్డి, నాయకులు కంది తిరుపతిరెడ్డి, చిట్టిమల్ల రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.