కమాన్‌చౌరస్తా, మార్చి 10 : గౌడ కులస్తుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీ కన్వెన్షన్‌లో ఉమ్మడి జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు మంత్రిని గౌడ సంఘాల బా టధ్యులు బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఆదర్శ సంస్థల ఎండీ బూరుగు సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాజేశం గౌడ్, మా జీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్, రాచకొండ తిరుపతి గౌడ్, రిటైర్డ్ డీసీపీ సుదర్శన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.