Minister Laxman Kumar | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల పద్మశాలి సంఘం భవనం మిగులు పనులకు సంబందించి రూ. 5 లక్షల నిధులు మంజూరు చేస్తూ, శుక్రవారం రష్ట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పద్మశాలి సంఘ నాయకులకు ప్రాసిడింగ్ కాపీని అందజేశారు.
దర్మపురిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఈ ప్రొసిడింగ్ కాపీని అందజేయగా, కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాజుల గంగమల్లేశం, కార్యదర్శి భోగ గోపికృష్ణ, కోశాధికారి బోగ గంగాధర్, మండల యూత్ అధ్యక్షుడు సాంబారి లక్ష్మీనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన మంత్రికి వారు కృతఙ్ఞతలు తెలిపారు.