సిరిసిల్ల/వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, నవంబర్ 26: ఎన్నికల ప్రచారంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్‌షో విజయవంతమైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల్లో కొత్త ఉత్సాహాన్నినింపింది. గర్జనపల్లి శివారులో హెలిప్యాడ్ దిగి ప్రత్యేక వాహనంలో వీర్నపల్లి చేరుకున్న కేటీఆర్‌కు మండల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రచారం రథం ఎక్కి అభివాదం చేయగా, జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. మహిళల నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో రోడ్‌షో ప్రాంగణం గులాబీమయమైంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఆదివారం మండల కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వన్‌పల్లి ఎంపీటీసీ బానోత్ పద్మ-సేవ్యానాయక్ అమాత్యుడు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత స్థానిక ఎన్నికల్లో బానోత్ పద్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంపీటీసీగా గెలుపొందారు. అమె భర్త సేవ్యానాయక్ తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించారు. పద్మ బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
వీర్నపల్లి రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఐదేండ్ల చిన్నారి గాయత్రి తప్పిపోయింది. ఆమె తల్లి నవ్య కన్నీరు కారుస్తూ ప్రచారం రథం పక్క నుంచి వెళ్లడాన్ని అమాత్యుడు గమనించారు. వెంటనే తన ప్రసంగాన్ని నిలిపివేసి, చిన్నారి గాయత్రి ఎక్కడున్నవని మైక్‌లో పిలిచారు. వెంటనే బాలికను గుర్తించిన ప్రజలు ప్రచార రథం వద్ద ఉన్న తల్లి నవ్యకు అప్పగించారు.
బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం ఇలా ఉంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం అందరినీ అకట్టుకున్నది. వీర్నపల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొం డూరి రవీందర్రావు, జడ్పీటీసీ గుగులోత్ కళావతి, ఎం పీపీ మాలోత్ భూల, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఎడ్ల సాగర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడ్గుల మల్లేశం, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాషా, వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ, ఓయూ జేఏసీ నేతలు దరువు ఎల్లన్న,
మందాల భాస్కర్ యాద వ్, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులో త్ సురేశ్‌నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు సామల్ల దేవరాజ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, ఏఎంసీ వైస్ చైర్మన్ భూక్యా తులసీరాం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తాటిలెంక ప్రభాకర్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు గుగులోత్ కళ, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మల్యాల అశోక్, విభాగం మండల ఉపాధ్యక్షుడు పొన్నం దేవరాజు, సర్పంచ్ పాటి దినకర్, ఉప సర్పంచ్ బోయిని రవి, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.