సుల్తానాబాద్‌రూరల్,అక్టోబర్ 29: సమష్టిగా పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి కేటీఆర్ సుల్తానాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సర్ధార్ రవీందర్‌సింగ్ నేతృత్వంలో సుల్తానాబాద్ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరా వు, మాజీ జడ్పీటీసీ అయిల రమేశ్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అమాత్యుడు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాసరిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చే యాలని కోరారు. పనిచేసిన వారికి సముచిత స్థా నం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీరివెంట నాయకులు కోమటిపల్లి సదానందం, గుంజ పడుగు హరి ప్రసాద్, గొట్టం మహేశ్, కొండ సత్యనారాయణ, రాంకుమార్, మహేశ్, బైరగొని రవీందర్, కొయ్యడ రమాకాంత్, రమణ ఉన్నారు.