కాంగ్రెస్‌కు అధికారమిస్తే కర్ణాటక గతే
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక గతే మనకు పడుతుందని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే ఆగమాగం అవుతోందని,
- విద్యుత్ కోతలతో రైతుల నరకయాతన
- తెలంగాణలో నీళ్లు, విద్యుత్‌కు కొదవ లేదు
- ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్
- ప్రజా ఆశీర్వాద యాత్రకు నీరాజనం
పెగడపల్లి, అక్టోబర్ 27: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక గతే మనకు పడుతుందని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే ఆగమాగం అవుతోందని, విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర నరక యాతన పడుతున్నారని వాపోయారు. అదే తెలంగాణలో విద్యుత్, నీళ్లకు కొదవ లేదని గుర్తు చేశారు. శుక్రవారం మండలంలోని ఆరవల్లి, ధోమలకుంట, సుద్దపల్లి గ్రామాల్లో ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా ఆరవల్లిలో నాయకురాలు దేవత ఆలయంలో మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మూడు గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నీళ్లు, విద్యుత్, విద్య, వైద్యం లేక ప్రజలు నానా కష్టాలు పడ్డారని, అప్పుడు ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇపుడు తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వాటిని అమలు చేస్తుంటే, కళ్ల బొళ్లి హామీలు గుప్పిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి అంటుండగా, ఇప్పుడు అదే పార్టీ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు సాయం దండగని పేర్కొనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే, రాష్ట్రం అధోగతి పాలవుతుందని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.

పదేండ్లలో ఆరవల్లి, ధోమలకుంట, సుద్దపల్లి గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానన్నారు. ఆరవల్లిలో అతి పురాతన కాలానికి చెంది, మూత పడ్డ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి ఎన్నికలయ్యాక 25 లక్షల నిధులు మంజూరు చేస్తానని కొప్పుల ఈశర్ హామీ ఇచ్చారు. పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మూడు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు మంత్రి ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, ఎంపీపీ గోళి శోభా సురేందర్‌రెడ్డి, సర్పంచులు ఉప్పలంచ లక్ష్మణ్, బాల్సాని నిహారికాశ్రీనివాస్, నేరెళ్ల హారికాగంగాధర్, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు లోక మల్లారెడ్డి, బండి వెంకన్న, నంచర్ల విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు ఉపుపగండ్ల నరేందర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రాజు ఆంజనేయులు, కో-ఆప్షన్ సభ్యుడు రహీం, మండల అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు ఇరుగురాల ఆనందం, ఉపాధ్యక్షుడు మాదారపు కరుణాకర్‌రావు, యూత్ అధ్యక్షుడు సంతోశ్, మహిళా అధ్యక్షరాలు మమత, నాయకులు అన్నెమల్ల కాంతయ్య, తిర్మణి నర్సింహారెడ్డి, రమణారెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాస్, మహేశ్, గాలిపెల్లి సత్తయ్య, శోభన్‌బాబు, బాబురావు, రాజశేఖర్‌గౌడ్, విజయ్‌యాదవ్, తిరుపతి, సాగర్, జానీ, సంజీవరెడ్డి ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

