హైదరాబాద్ : మున్సిపల్, ఐటీశాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేక్ కట్ చేసి, ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవశకానికి నాంది పలికిన నాయకుడు కేటీఆర్ అని, సీఎం కేసీఆర్ వారసునిగా ఆయన ఆలోచనలను సమర్థవంతంగా ఆచరణలో పెట్టగల దీశాలి అని కొనియాడారు. స్థానికులకు మొక్కలు పంపిణీ చేసి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని పలుప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఎడ్ల సరిత అశోక్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి, పండ్ల పూల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పలు డివిజన్లలో "కోటి మహావృక్షార్చన" కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది pic.twitter.com/784li5fCNX
— Gangula Kamalakar (@GKamalakarTRS) July 24, 2021