అవగాహనతోనే క్యాన్సర్కు అడ్డుకట్ట
అవగాహనతోనే క్యాన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల పేర్కొన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్ స్టిట్యూట్, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని ట్రినిటి గర్ల్స్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు
- మంత్రి గంగుల కమలాకర్
- కరీంనగర్లో క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభం
విద్యానగర్, సెప్టెంబర్ 24 : అవగాహనతోనే క్యాన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల పేర్కొన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్ స్టిట్యూట్, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలోని ట్రినిటి గర్ల్స్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న నిరంతర సేవలను అభినందించారు.
భవిష్యత్లో సేవలను విస్తరించాలని కోరారు. ఏవోఐ ప్రాంతీయ సీఓఓ డాక్టర్ ప్రభాకర్ పాలచర్ల మాట్లాడుతూ, క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారణ సులభమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ సునీల్రావు, జిల్లా వైద్య అధికారి జువేరియా, కార్పొరేటర్ మేచినేని వనజ-అశోక్ రావు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

