Millennium Association | చిగురుమామిడి, అక్టోబర్ 11: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పడాల రాజమల్లు గుండెపోటుతో ఇటీవల మృతిచెందాడు. కాగా వారి కుటుంబానికి మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పది వేలు నగదు ఆర్థిక సాయాన్ని వారి కుటుంబానికి శనివారం అందజేశారు.
అందజేసిన వారిలో మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షుడు బండారి రవికుమార్, ఉపాధ్యక్షులు గందె చిరంజీవి, కార్యదర్శి పరుపాటి మహిపాల్ రెడ్డి, కోశాధికారి లంక సిరి శ్రీనివాస్, సభ్యులు దుడ్డేల రాజు, గోనెల రాములు, ప్రశాంత్ చారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.