సిరిసిల్ల రూరల్, మే10: రేవంత్‌రెడ్డి సర్కార్ అన్నివిభాగాల్లో విఫలమైందని, ప్రజలకు మోసపూరిత హమీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నదని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్ పేర్కొన్నారు. రాబోయే బీఆర్ఎస్ సర్కారేనని.. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని ఫంక్షన్హాల్లో కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2010లోనే కేటీఆర్ సేనకు శ్రీకారం చుట్టామని, తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ వెంటనే సైనికుల్లా పని చేశామన్నారు.
2014లో కేటీఆర్ సేనను రిజిస్ట్రర్ చేసి, కేటీఆర్ సేనను బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం 23 జిల్లాలో కేటీఆర్ సేన విస్తరించామని, 18జిల్లాలో కమిటీలను వేశామన్నారు. ఇప్పటికే 4లక్షల మంది కేటీఆర్ సేన సైనికులు తయారయ్యారని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హమీలు ఇచ్చి ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఎండగడుతామన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డిని దోషిగా నిలబెడుతామన్నారు. కేసీఆర్ పాలనలో దేశంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా చేశారన్నారు. తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న మాట్లాడుతూ, కేటీఆర్ సేన ద్వారా రామన్నకు మంచి పేరు తేవాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
కేటీఆర్సేన మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్‌గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో కేటీఆర్ సేన కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మెంగని మనోహర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, పీఏసీఎస్ చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, కోడూరి భాస్కర్‌గౌడ్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు అంకారపు రవీందర్, మాజీ ఎంపీపీ పడిగెల మానస, ఏఎంసీ మాజీ చైర్మన్ పూసపల్లి సరస్వతి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పడిగెల రాజు, తెలంగాణ జాగృతి మండలాధ్యక్షుడు కందుకూరి రామాగౌడ్, బండి జగన్, మోర నిర్మల, కేటీఆర్ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి కేటీఆర్ సేన మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్‌గౌడ్, సోషల్ మీడియా అధ్యక్షుడు పిట్ల విన్నుబాబు, మండల ఉపాధ్యక్షుడు మామిడాల విజయ్, రేగుల రాజు, ప్రధాన కార్యదర్శి తౌటి శివకృష్ణ, మండల ఇన్చార్జి ఉమాశంకర్, ప్రచార కార్యదర్శి గడ్డం అజయ్‌కి రాష్ట్ర అధ్యక్షడు మెంగని మనోహర్, తంగళ్లపల్లి నేతలు నియామక పత్రాలు అందజేశారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు.