Minister Laxman Kumar | ధర్మారం, జూలై 17 : జగిత్యాల జిల్లా ధర్మపురి లోని క్యాంప్ ఆఫీస్ లో ఎస్సీ, ఎస్టి, మైనారిటీ, దివ్యాంగుల శాఖ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెద్దపల్లి జిల్లా ధర్మారం పద్మశాలి సంఘ సభ్యులు గురువారం మార్యదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లక్ష్మణ్ కుమార్ ను వారంతా తొలిసారి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఒడ్నాల శంకరయ్య, డాక్టర్ కామిని శ్రీనివాస్ కుంట రాజు, దేవసాని సత్యనారాయణ, గుర్రం రాజేశం, తన్నేరు లక్ష్మి నర్సయ్య, సిరిమల్ల మోహన్, ఎలిగేటి మహేందర్, విట్ట రవి, గుడిమల్ల సురేష్, పులి విట్టల్, తుమ్మ శ్రీనివాస్, బుదారపు మధు, గౌడ శేఖర్,సుంకె శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్, కుంట తిరుపతి, ఇప్పలపల్లి సురేందర్, కడారి గంగాధర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.