MLA Dr. Kalvakuntla Sanjay | వారసత్వ సంపద గడి గురుజుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
వారసత్వ సంపద గడి గురుజుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
- పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలి
- మున్సిపల్ సాధారణ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జూన్ 23 : వారసత్వ సంపద గడి గురుజుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోరుట్లలోని పురాతనమైన గడి గురుజుల భూములను రక్షించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అధికారులు స్థలాల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా ప్రతీ నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి నివారణ అధికారులు ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అన్ని వార్డుల్లో బోరు బావులు తవ్వించాలన్నారు. మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న కాలనీల్లో మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్దరించాలని సూచించారు. మున్సిపల్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిదులకు మాట్లాడే అవకాశం కల్పించాలని తెలిపారు. కోరుట్లలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు భూముల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు అనేవి ఎన్నికల వరకే పరిమితం కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణాభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రతినిదులు పార్టీలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో వరదల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అంతకుముందు అధికారులు పలు అభివృద్ధి పనుల కోసం ప్రవేశపెట్టిన పలు అంశాలను కౌన్సిల్ సభ్యులు అమోదం తెలిపారు. మున్సిపల్ సమావేశానికి హజరైన ఎమ్మెల్యేను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, డీఈఈ అరుణ్ కుమార్, మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అశోక్, అధికారులు, కౌన్సిలర్లు, కో- అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

