MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్ అక్టోబర్ 1 : దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో గల జగత్ మహా మునీశ్వర స్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయా గ్రామాల ఉత్సవ కమిటీలు ఎమ్మెల్యే విజయ రమణారావును శాలువాలతో సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని పాండవుల గుట్ట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గాజన వేన సదయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మార్కెట్ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.