Mathani | ముత్తారం, జులై 14: మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీని మంథని డీఎల్ పీవో సతీష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆపరిశుభ్ర ప్రాంతాలు, డ్రెయిన్లు, సీజనల్ జ్వరాల గురించి వివరాలు అడగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్ ను సరిగ్గా వినియోగించుకోవాలని కంపోస్ట్ ను వెంటనే తయారు చేయాలని సూచించారు. సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలా మొక్కలను నాటాలని తెలిపారు. ఇక్కడ ఎంపీడీవో సురేష్, ఎంపీవో భాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.