Peddapally | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 31 : పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామంలోని శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వికాస తరంగిణి పెద్దపల్లి-01 ఆద్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళ శాసనాలతో శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి హాజరై ప్రవచనాలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యులు, స్థానిక సర్పంచ్ దాడి మౌనిక సంతోష్ యాదవ్ దంపతులతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్ , జూనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లు , ఎంపీటీసీలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.