Sultanabad | సుల్తానాబాద్ రూరల్, జనవరి 9 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోనీ అంగన్ వాడీ-1 కేంద్రంలో టీచర్ అమల ఆధ్వర్యంలో శుక్రవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, అన్న ప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీటితో పాటు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండేటి దేవేందర్, ఉప సర్పంచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజేందర్, వార్డు సభ్యులు పుష్పలత, మమత లక్ష్మణ్, సంతోష్, కాలిద్, రమేష్, కవిత రమాకాంత్ తో పాటు ఆశా వర్కర్లు, తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.