GodavariKhani | కోల్ సిటీ, జనవరి 24: వసంత పంచమి సందర్భంగా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోదావరిఖని శేఖర్ నగర్ (కోడ్ నం.90)లో శనివారం సీమంతాలు, సామూహిక అక్షరభ్యాసం వేడుకతో సందడి నెలకొంది. రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ సూచనల మేరకు ఆంగన్వాడీ కేంద్రంలో టీచర్ ఎస్. శైలజ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన, సామూహిక అక్షరభ్యాసం చేయించారు.
అలాగే గర్భిణీ స్త్రీలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు అందజేసి గాజులు తొడిగి సీమంతాలు నిర్వహించారు. పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పుట్టబోయే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్ శాంత, జీ. కుమారి, శ్వేతలత, తిరుమల, అంబికా వర్మ, అనూష, హర్ష సుజాత, రమ్య, ఆఫ్రీన, రాజేశ్వరితోపాటు బస్తీ మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.