Sucide | పెగడపల్లి: పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు సుప్రియ (25) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ, భరించలేక, ఈ నెల 12న పురుగుల మందు తాగింది. కాగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.
చికిత్స పొందుతూ సుప్రియ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతురాలి భర్త నరేందర్ ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ లాస్య శ్రీ పంచనామా నిర్వహించారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.