Suicide | వేములవాడ రూరల్, మే 9 : వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గూగులోత్ దివ్య (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తమామలే ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. నూకలమర్రి గ్రామానికి చెందిన గూగులోత్ వినోద్ కు జగిత్యాల చెందిన దివ్యతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇటీవల వినోద్ దుబాయ్ వెళ్లాడు. 15 రోజుల క్రితమే దివ్య అమ్మగారింటికి వెళ్లగా శుక్రవారం నూకలమర్రి కి చేరుకుంది.
ఇంటికి చేరుకున్న అనంతరం ఇంటి వద్ద ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకొని వినోద్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. దివ్య ఆత్మకు వినోద్ కుటుంబ సభ్యుల కారణమని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడ చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.