Bandi Sanjay | జ్యోతినగర్, మే 5: మావోయిస్టులు గతంలో సాధించింది కానీ, భవిష్యత్‌లో సాధించేది కానీ ఏముండదని, జనజీవన స్రవంతిలో కలువాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని వీఐపీ గెస్ట్ హౌస్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలు ఏవరు తూపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరన్నారు.
ప్రభుత్వంతో చర్చలకు కోరుకుంటున్న నక్సలైట్లు తమ తూపాకులను పక్కన పెట్టి లోంగిపోవాలన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులను కాల్పి చంపారన్నారు. వరవరరావు, హరిగోపాల్ ఎంతో మంది మావోయిస్టుల శవాలను మోసి ఏమి సాధించారన్నారు. భారత దేశంలో జాతీయ జెండాను ఎగురవేసిన వారే దేశభక్తులని,నల్ల జెండాలను ఎగురవేసిన వారు దేశ ద్రోహులని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని, గతంలో కాంగ్రెస్ పార్టే మావోయిస్టు పార్టీపై నిషేధం విధించిందని, ఇప్పుడు వారి మెప్పు పొందేందుకే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కుల గణన సర్వే నామమాత్రంతో బీసీలకు అన్యాయం చేసిందన్నారు. కేంద్రం ప్రభుత్వం చెపట్టే సర్వేతో బీసీలకు సముచిత న్యాయం జరుగనుందన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అంతకుముందు హోంశాఖ సహాయ మంత్రి గెస్ట్‌హౌజ్‌కు విచ్చేయగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి పోచం, బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు కోమళ్ళ మహేశ్, క్యాతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.