Jagityal | జగిత్యాల, అక్టోబర్ 8: ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల విద్యార్థుల కు ధీటుగా సైన్స్ డ్రామా లో ఉత్తమ ప్రతిభ ను కనభర్చిన కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పై ప్రశంసల జల్లు కురిసింది. శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్ లో సైన్స్ డ్రామా పోటీలు జరిగాయి.
ఇందులో కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ ను కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచారు అదే రోజు జిల్లా విద్యాధికారి రాము చేత శభాష్ అనిపించుకొన్న విద్యార్థులకు స్థానికుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఆ గ్రామ మాజీ సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్ లతో పాటు పలువురు విద్యార్థులను అభినందించారు. బుధవారం పాఠశాల లో హెచ్ఎం స్వరూపారాణి, సైన్స్ టీచర్ చిక్కుల రమేష్, గంగారెడ్డి తోపాటు టీచర్స్ శ్రీకళ, రాధాలక్ష్మి, స్వర్ణలత, కల్పన, లావణ్య లు విద్యార్థులను శాలువా కప్పి అభినందించారు.