Peddapally ACP | పెద్దపల్లి రూరల్, జూలై 27 : పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తండ్రి గజ్జి ఐలయ్య పదిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కఠారి రేవతిరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ జైపూర్ లోని రసూల్ పల్లి లో గల పెద్దపల్లి ఏసీపీ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఏసీపీ తండ్రి గజ్జి ఐలయ్య చిత్రపటానికి రాష్ట్ర మహిళ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐలయ్య మృతికి గల కారణాలను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్ ను అడిగి తెలుసుకుని సంతాపం వెలిబుచ్చారు. వారి వెంట పలువురు పెద్దపల్లి, మంథని నియోజకవర్గం, పట్టణాలను చెందిన నాయకులు పాల్గొన్నారు.