Dharmaram | ధర్మారం, మార్చి 14 : ధర్మారం మండల కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నాయీ బ్రాహ్మణ యువ గళం ఫౌండేషన్లో శనివారం పలువురు నాయీ బ్రాహ్మణులు చేరారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫౌండేషన్ ఏర్పాటు కాగా సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాల కోసం ఇప్పటికే రూ.2.50 లక్షల సొమ్ము జమైంది. ఈ క్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం వీరేందర్ నాయీ అధ్యక్షతన ధర్మారంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో బ్రాహ్మణులు మందపల్లి లక్ష్మణ్, మందపల్లి తిరుపతి, అమరపల్లి రాజేశం, మందపల్లి చందు, మందపల్లి రమేష్, మందపల్లి పోచమల్లు డిస్కో తిరుపతి తదితరులు కలిసి బ్రాహ్మణ యువగళం ఫౌండేషన్ లో ధర్మపురి నియోజక వర్గం ఇన్చార్జి అమరపల్లి నారాయణ, మండల ఇన్చార్జి పసునూటి సతీష్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం వీరేందర్ నాయీ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ యుగళం ఫౌండేషన్ ఆపదలో ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయం చేసే విధంగా ఫౌండేషన్ ఎంతో అభివృద్ధిలో నడుస్తుందని అన్నారు.
సేవా గుణం ఈ ఫౌండేషన్ లో చేరాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నూతనంగా చేరిన సభ్యులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి గర్షకుర్షి అంజనేయలు, చొప్పదండి మండలం ఇన్చార్జి శ్రీగాద రాజు, ముఖ్య సలహాదారుడు శ్రీగాద పెద్ద నారాయణ తదితరులు పాల్గొన్నారు.