scholarship | మంథని, జులై 25: మంథని పట్టణానికి చెందిన నరెడ్ల కృష్ణ చైతన్య అరుదైన ఘనత సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ పీపుల్, కాలిఫోర్నియాలోని పసాదేనాలొని విశ్వవిద్యాలయం నుండి అడ్వాన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లో మాస్టర్ పూర్తి చేయడానికి ఇంటర్నేషనల్ బాకలారియేట్ నుండి స్కాలర్షిప్ పొందిన రెండు తెలుగు రాష్ట్రాలలోని మొట్టమొదటి వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు.
మొత్తంగా భారతదేశం నుండి 2025 సంవత్సరానికి కేవలం ఇద్దరు మాత్రమే స్కాలర్షిప్ అందుకున్నారు. స్కాలర్షిప్ అందుకోవడం తనకు గర్వకారణంగా ఉందని ఆమె వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర విద్యకు తన వంతు కృషి చేస్తానని ఆమె వివరించారు. స్కాలర్షిప్ సాధించిన నరేడ్ల కృష్ణ చైతన్యను పట్టణవాసులు, విద్యా ప్రముఖులు అభినందించారు.