Teachers Day | తిమ్మాపూర్,సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం నాడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోడి టీచర్ అంటూ రసమయి బాలకిషన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్‌లోని అరుంధతి కల్యాణమండపంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను కవ్వంపల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోడి టీచర్ అంటూ వివాస్పద వాఖ్యలు చేశారు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు గోసి గొంగడితో వచ్చావని, బోడి టీచరు ఉద్యోగం చేశావని విమర్శించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కవ్వంపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయ వర్గాలు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీచర్స్ డే నాడు ఇలా ఉపాధ్యాయ వృత్తిని కించపరిచేలా మాట్లాడటమేంటని మండిపడుతున్నారు.