Chigurumamidi | చికిత్స పొందుతూ ముల్కనూర్ వ్యక్తి మృతి
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామానికి చెందిన కత్తెరమల్ల రమేష్ (28) వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ సోమవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు.
Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 12 : చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామానికి చెందిన కత్తెరమల్ల రమేష్ (28) వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ సోమవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మృతి చెందాడు. బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. దుర్గాష్టమి, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు విద్యుత్ బల్బులు అమర్చేందుకు రమేష్ ను పనికి పిలిపించారు. ప్రతీసారి గ్రామ పంచాయతీ విద్యుత్ పనులకు వచ్చే రమేష్ యథావిధిగా వచ్చి విద్యుత్ స్తంభం ఎక్కి బల్బులు బిగిస్తుండగా, పైన ఉన్న విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగిలి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన రమేష్ ను సర్పంచ్ వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.రమేష్ మృతి పట్ల సర్పంచ్ సాంబారి భారతమ్మ-కొమురయ్యతో పాటు అన్ని పార్టీల నాయకులు బుర్ర తిరుపతి, సాంబారి కొమురయ్య, పెసరి రాజేశం, బరిగెల సదానందం, సాంబారి బాబు, పూదరి వేణు, ముప్పిడి దేవేందర్ రెడ్డి, కయ్యం సారంగం, కయ్యం తిరుపతి సంతాపం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
Sanjay Raut | నాగ్పూర్ పేరును ‘దీక్షాభూమి’గా మార్చండి: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

