BT road | కొనరావుపేట : మామిడిపల్లి, ఏనుగల్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కొనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఏనుగల్ రోడ్డు పై రైతులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మామిడిపల్లి, ఎనగల్ గ్రామాల మధ్యలో బీట్ రోడ్డు నిర్మించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్న రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదన్నారు.
దీంతో పంట పొలాలలకు వెళ్లాలంటే ఇబ్బందుల గురవుతున్నమని వాపోయారు. గత ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి ప్రొసిడింగ్ అందించి నిధుల మంజూరు చేయగా ఇప్పటివరకు రోడ్డు పనులు చేయలేదని విమర్శించారు. మరి ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే రెండు మండలాల మధ్య వారధిగా వున్న ఈ రోడ్డుపై పాలకులు చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపి రోడ్డు నిర్మించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.