Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 9: కాలం చెల్లిన ముడి పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తున్న సంఘటన గోదావరిఖనిలో వెలుగు చూసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ షాపు యజమానికి రామగుండం నగరపాలక సంస్థజరిమానా విధించింది.
రామగుండం నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖనిలో పలు బేకరీ షాపులపై ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీ నగర్ లోని సిరి కేక్స్ అండ్ మోర్ దుకాణంలో తనిఖీలు చేయగా కాలం చెల్లిన రసాయనాలు, ఇతర పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించి రూ.20 వేలు జరిమానా విధించారు.
చట్ట ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఈ తనిఖీలలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ted ingredients