రోడ్డెక్కిన మక్క రైతు.. కొనుగోళ్లలో సర్కారు జాప్యంపై ఆగ్రహం
మెట్పల్లి నియోజకవర్గ మక్క రైతులు కన్నెర్ర జేశారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంపై భగ్గుమన్నారు. సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొరపెట్టుకుంటున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ బుధవారం మెట్పల్లి పట్టణంలో రోడ్డెక్కారు.
- మెట్పల్లిలో జాతీయ రహదారిపై ధర్నా
- వెంటనే సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
మెట్పల్లి, ఏప్రిల్8 : మెట్పల్లి నియోజకవర్గ మక్క రైతులు కన్నెర్ర జేశారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంపై భగ్గుమన్నారు. సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మొరపెట్టుకుంటున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ బుధవారం మెట్పల్లి పట్టణంలో రోడ్డెక్కారు. శాస్త్రీచౌక్ వద్ద 63వ జాతీయ రహదారిపై మండుటెండలో ధర్నా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ, కేంద్రాల ప్రారంభం రేపు.. మాపు అంటూ ప్రకటనలు ఇస్తున్నారనే తప్ప క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహించారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో మంత్రి వచ్చి ప్రారంభించినా, ఇప్పటివరకు ఒక్క కిలో మక్కలు కొనలేదని విమర్శించారు. కొనుగోళ్లలో జాప్యంతో దళారులు రెచ్చిపోతున్నారని, మద్దతు ధర క్వింటాల్‌కు 2400 ఉంటే 1600 నుంచి 1800 వరకు మాత్రమే చెల్లిస్తుండడంతో తాము నష్టపోతున్నామని వాపోయారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి మండలానికి ఒకటి లేదా రెండు సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధరతో మక్కలు కొనాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా రైతులను సంఘటితం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. ఇక్కడ రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు మారు మురళీధర్‌రెడ్డి, ఆకుల రాజారెడ్డి, గడ్డం రాజారెడ్డి, శేఖర్‌రెడ్డి, సురేశ్, మోహన్, మల్లేశ్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, మల్లాపూర్ మండలాల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

