అల్లీపూర్ గురుకులంలో విద్యార్థుల మధ్య గొడవ
అల్లీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి గాయాలు కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల స్కూల్లో సోమవారం 6వ, 7వ తరగతి విద్యార్థులు గొడవపడ్డారు.
రాయికల్, ఏప్రిల్ 9: అల్లీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి గాయాలు కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల స్కూల్లో సోమవారం 6వ, 7వ తరగతి విద్యార్థులు గొడవపడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు. అయితే మంగళవారం ఉగాది సెలవు దినం కావడంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు గాయాలను చూసి ఆందోళన చెందారు.
ఘటన గురించి ఉపాధ్యాయులు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులం ఎదుట రాయికల్ జగిత్యాల రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. టీచర్ల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. గురుకులంలో నిత్య పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. రాయికల్ ఎస్ఐ అజయ్ అక్కడికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. తల్లిదండ్రులు, గురుకుల ఉపాధ్యాయులతో మాట్లాడి సంఘటన వివరాలు సేకరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

