US States | ట్రంప్ టారిఫ్స్‌ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన 25 రాష్ట్రాలు
US States | టారిఫ్స్‌పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. భారత్ (India) సహా 60 భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన కొత్త పన్నులను సవాల్ చేస్తూ.. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.
US States : టారిఫ్స్‌పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. భారత్ (India) సహా 60 భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన కొత్త పన్నులను సవాల్ చేస్తూ.. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తమ చట్టబద్ధమైన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దావా వేశాయి.
న్యూయార్క్‌లోని ‘యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’ లో 25 రాష్ట్రాల కూటమి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. వెట్టి చాకిరీ ద్వారా తయారుచేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలుచేయడం లేదనే ఆరోపణలతో గత నెలలో ట్రంప్ ప్రభుత్వం సుంకాలను విధించింది. భారత్ సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సుంకాల వల్ల వినియోగదారులు, వ్యాపారాలపై భారం పడుతుందన్న 25 రాష్ట్రాలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించాయి. ఇంతకుముందు కూడా ట్రంప్ విధించిన అనేక సుంకాల నిర్ణయాలు అమెరికా కోర్టులలో చట్టపరమైన చిక్కులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టారిఫ్‌లపై నమోదైన కేసు ట్రంప్ వాణిజ్య విధానాలకు మరో పెద్ద పరీక్షగా మారనుంది. ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు.
చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులకు, అలాగే యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

