Chinnakalvala | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ మహమ్మాయిదేవి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారంతో ముగిసాయి. ఈ ఉత్సవాలను ఆలయంలో ప్రతీ ఏటా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 29న ప్రారంభించి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మంటపారాధనలు, సహస్రనామ పూజలు, కుంకుమార్చనలు, మహా మంత్రపుష్పములు, దంపతులచే హోమ కార్యక్రమాలు తదితర ప్రత్యేక పూజలు వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హాజరై ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు దేవరకొండ కృష్ణమాచార్యులు, దేవరకొండ రాధాకృష్ణమాచార్యులు, దేవరకొండ శ్రీధరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.