Challur | వీణవంక, జనవరి 28 : వీణవంక మండలంలోని చల్లూరులో శ్రీ మహాలింగేశ్వరస్వామి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వైభవోపేతంగా నిర్వహించారు. మహాలింగేశ్వర ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వేదపండితులు గణపతిపూజ, నుణ్యాహవచనం, శ్రీ గణపతి, మూలమంత్ర శ్రీరుద్రహవనం, అష్టోత్తర కలశాభిషేకం, అగ్నిహోమాలు వంటి కార్యక్రమాలు కన్నుల పండువగా జరిపించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దీవెనలు పొందారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, గౌరవాధ్యక్షుడు వాల బాలకిషన్‌రావు, ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది సమ్మిరెడ్డి, సర్పంచ్ రామిడి సంపత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, అర్చకులు రాజగోపాలశర్మ, పండితులు మధుసూదనాచార్యులు, భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.