Phone tapping case | జగిత్యాల, జూన్ 29 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దురుద్దేశపూర్వకంగా మహా టీవీలో అసత్య వార్తలు ప్రసారాలను జగిత్యాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి తప్పుడు కథనాలు మహాటీవీ వార్తలు ప్రసారం చేస్తున్నదని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల అమలు, 420 హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. మహా టీవీ జర్నలిజం ముసుగులో కేటీఆర్ పై వ్యక్తిగతంగా విషం చిమ్ముతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్న కేటీఆర్‌ని ఎలాగైనా కట్టడి చేయాలని వ్యూహంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండే కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో ఒక కేసులో ఇరికించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రయత్నం ఏదో ప్రజలకు ఇచ్చిన హామీలపై పెడితే బాగుంటుందని సూచించారు.