eye donation | మానకొండూర్ రూరల్, ఆగష్టు 3: మద్దికుంట గ్రామానికి చెందిన కుక్కల సురేష్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులు తల్లి రమ, భార్య ప్రియాంకను సురేష్ నేత్రాలను దానం చేసేలా అవగాహన కల్పించి, మరోకరికి చూపు వస్తుందంటే నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
వీరి అంగీకారంతో మాజీ సర్పంచ్ కొత్తూరు జగన్ గౌడ్ ఆధ్వర్యంలో సురేష్ నేత్రాలను రామాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ కు ఆదివారం దానం చేశారు. ఆ మృతుడి కుటుంబ సభ్యులను నేత్రాలను దానం చేసినందుకు పలువురు కుటుంబ సభ్యులను అభినందించారు.