Donating blood | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 11: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజ్ పల్లి గ్రామానికి చెందిన మడ్డి సాయి కిషోర్ గౌడ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే పేషెంట్ కి ప్రతిమ హాస్పటల్ లో బ్రెయిన్ సర్జరీ ఉండగా వారికి ఓ నెగటివ్ రక్తం అవసరం ఉందని వై కే ఫౌండేషన్ కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సాయికిషోర్ గౌడ్ ప్రతిమ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.
ఇప్పటివరకు 31వ సారి రక్తదానం చేసి అందరి మన్ననలను పొందుతున్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు వై కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కండెం సురేష్ , గౌరవ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్‌తో పాటు పలువురు సాయికిషోర్ కి కృతజ్ఞతలు తెలిపారు.