Elected | చిగురుమామిడి, ఆగస్టు 11: తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. మన గలం, మన బలం ప్యానెల్ లో నుండి కార్యవర్గ సభ్యునిగా పోటీ చేసిన చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మాడ సునీల్ రెడ్డి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సునీల్ రెడ్డి 9 సంవత్సరాలుగా డబ్బింగ్ రంగంలో రాణిస్తూ తన గాత్రం ద్వారా సేవలు అందిస్తున్నారు.
ఇటీవల హైదరాబాదులో 24 గంటల నాన్ స్టాప్ గాత్ర కళాకారుల స్వరార్చన కార్యక్రమంలో పాల్గొని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు స్వీకరించారు. సునీల్ రెడ్డి ప్రస్తుతం టీ న్యూస్ లో వాయిస్ ఓవర్ గా విధులు నిర్వహిస్తూ, రెండు సినిమాల్లో నటించారు. వీరు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కావడం పట్ల రేకొండ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.