గన్నేరువరం : మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడిని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ మాడుగుల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనుకయ్య గౌడ్ ,వైస్ ఎంపీపీ స్వప్నాసుధాకర్, సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్లు, సురేశ్, వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు.