కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 23 : నగరంలోని భగత్‌నగర్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం తెప్పోత్సవం, కాకడ హారతి, పడి పూజా మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీ సంపత్ నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల య అర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డిం గరి చాణక్య ఆధ్వర్యంలో గణపతి హోమం చేశా రు. ఆ తర్వాత పలువురు స్వాములు మాండువ (మానేరు డ్యాం) నది నీటిని తీసుకురాగా, పం డితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుంభాషే కం, అభిషేకాలు నిర్వహించారు.
ఆ తర్వాత ఫల, పంచామృతాలతో అభిషేకించారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప స్వాములు, భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతరం మధ్యాహ్న సమయంలో భిక్ష ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, మహా పడిపూజ నిర్వహించారు. భజనలు, పూజలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్భం గా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఇక్కడ ఈవో కొస్న కాంతా రెడ్డి, గురుస్వాములు గడప నాగరాజు, రుద్రాక్ష కృష్ణ, జీఎస్ ఆనంద్, లింగంపల్లి సత్యనారాయ ణ, పెద్దసంఖ్యలో స్వాములు పాల్గొన్నారు.