
Local body elections | మంథని/మంథని రూరల్/ముత్తారం/రామగిరి/కమాన్‌పూర్/కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 11: డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్‌లో కొనసాగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో గురువారం ముగిసాయి. జిల్లాలోనే మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఐదు మండలాల్లో మొత్తం 82.27 శాతం నమోదు కాగా 1,43,856 మంది ఓటర్లకు గాను 1,18,346మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 58907, స్త్రీలు 59437, ఇతరు ఇద్దరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంథని మండలంలోని గుంజపడుగు, నాగారం, చిల్లపల్లి పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ , గోపాల్పూర్, గుంజపడుగు, ఎక్లాస్పూర్, రచ్చపల్లి పోలింగ్ కేంద్రాలను డీసీపీ బి. రాంరెడ్డి, ఏపీపీ మడత రమేష్, ముత్తారంలోని పోలింగ్ కేంద్రాలను ఏసీపీ గజ్జి కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా వీరంతా పోలింగ్ సరళీ, క్యూలైన్లు, బందోబస్తు వంటి ఆంశాలను పరిశీలించడంతో పాటు పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. అదే విధంగా ఏది ఏమైనప్పటికీ ఈ ఐదు మండలాల్లోని ఏ పోలింగ్ కేంద్రంలో కూడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనటు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడంతో ఇటు పోలీసులు.. అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మండలాల వారిగా పోలింగ్ ప్రక్రియ నమోదు ఇలా..
మంథని మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లో 33862 మంది ఓట్లకు గాను 28575 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 14196, స్త్రీలు 14378 మంది, ఇతరులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకోగా 84.39 శాతం పోలింగ్ నమోదు అయింది. ముత్తారం మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 23197 మంది ఓట్లకు గాను 19195 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 9445, స్త్రీలు 9750 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 82.75 శాతం పోలింగ్ నమోదు అయింది.
రామగిరి మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 31832 మంది ఓట్లకు గాను 24815 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 12340, స్త్రీలు 12474 మంది, ఇతరులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకోగా 77.96 శాతం పోలింగ్ నమోదు అయింది. కమాన్‌పూర్ మండలంలోని 9 గ్రామ పంచాయతీల్లో 20145 మంది ఓట్లకు గాను 16839 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 8412, స్త్రీలు 8427 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 83.59 శాతం పోలింగ్ నమోదు అయింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 34821 మంది ఓట్లకు గాను 28922 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 14514, స్త్రీలు 14408 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 83.06 శాతం పోలింగ్ నమోదు అయింది.
మంథనిలో అత్యధిక పోలింగ్.. అత్యల్పంగా రామగిరిలో పోలింగ్ నమోదు..
మొదటి విడుత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా మంథని మండలంలోని 34 గ్రామ పంచాయతీల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 84.39 శాతం పోలింగ్ నమోదు కాగా, రామగిరి మండలంలో 14 గ్రామ పంచాయతీలోని ఓటర్లు 77.96 శాతం మాత్రమే ఓటింగ్‌ను వినియోగించుకోవడంతో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదు అయింది.