Literacy | చిగురుమామిడి, ఆగస్టు 2: గ్రామఖ్య సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత సేర్ఫ్ సిబ్బంది, సీఏలపై ఉందని ఏపీఎం మండల రజిత అన్నారు. మండల కేంద్రంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య భవనంలో మండల స్థాయి సీఏ లతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు.
సంఘాలను బలోపితం చేయడంలో సిఏలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. సంఘ సభ్యులు యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆదాయ అభివృద్ధిని పెంపొందించుకోవాలని, అందులో సీసిఏల పాత్ర వినలేనీదన్నారు. గ్రామాల్లో మహిళ సంఘ సభ్యులు పొదుపులు, అప్పులు, బ్యాంకు లింకేజీ, శ్రీనిధిని వాయిదాల పద్ధతిలో నెలవారిగా చెల్లించేలా మహిళలను ప్రోత్సహించాలన్నారు. నిరక్షరాస్యులుగా ఉన్న మహిళా సభ్యులను ఉల్లాస్ దరఖాస్తు ఫారం లో నమోదు చేయాలన్నారు.
ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు రాసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. మహిళలందరినీ సంఘటితంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతినెల సమావేశాలు విధిగా నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రామాల వారిగా సీఏలతో గ్రామైక్య సంఘాల ఆదాయ, వ్యయాలను, సంఘ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు గందె రజిత, సీసీలు సత్యనారాయణ, వెంకటమల్లు, గంప సంపత్ కుమార్, దుబ్బాక వెంకటేశ్వర్లు, అన్ని గ్రామాల సీఏ లు పాల్గొన్నారు.